ప్రజలకు ఏం చేస్తారో చెప్పి బీజేపీ ఓట్లు అడగాలి- మంత్రి హరీష్‌

88
- Advertisement -

మంగళవారం జమ్మికుంట పట్టణంలోని వివిధ వార్డుల నుంచి యువకులు, మహిళలు, పలువురు నాయకులు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భరంగా మంత్రి హరీష్‌ వారికి గులాభీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మోత్కుల గూడెం 90 శాతం టీఆర్ఎస్ వైపు వచ్చింది. ఆరు సార్లు ఈటెల రాజేందర్‌కు అవకాశం ఇచ్చారు. రెండేళ్ల కోసం గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించండి అని కోరారు. 18 ఏళ్లలో మీకు ఈటెల చెయ్యని పని, మీ స్వంత జాగాలో ఇండ్లు కట్టించే బాధ్యత నాది, ఈశ్వరన్నది. నాయిని చెరువు దగ్గర బతుకమ్మ ప్లాట్ ఫామ్, గణేష్ నిమజ్జనానికి ప్లాట్ ఫామ్ కట్టిస్తామని హామీ ఇచ్చారు.

ఉద్యోగాలు ఇచ్చేది టీఆర్ఎస్ పార్టీ, ఉన్న ఉద్యోగాలను ఊడ గొట్టేది బీజేపీ పార్టీ.. రానున్న రోజుల్లో 50 వేల ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు. గడియారాలు ,బొట్టు బిల్లలు ఇచ్చారని బీజేపీకి ఓటు వేస్తే ఆగం అయిపోతారు. రూపాయి బొట్టుబిల్ల ఇచ్చిన బీజేపీకి ఓటు వేద్దామా, కళ్యాణ లక్ష్మి 1 లక్ష 116 రూపాయలు ఇచ్చే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దామా ఆలోచన చెయ్యండి అన్నారు మంత్రి. ఒక్కసారి శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించండి. మోత్కులగుడెంలో 300 ఇండ్లు కట్టిస్తాం. రెండు గుంటలు భూమి ఉన్న పేదవాడు శ్రీనివాస్. మీ తలలో నాలుక లాగా మెదులుతాడు అని తెలిపార.

సహాయం చేస్తున్న చేతులు టీఆర్ఎస్ వి, పేదలకు భారం మోపుతున్న పార్టీ బీజేపీ అని దుయ్యబట్టారు. గెల్లు శ్రీను గెలుపు ఖాయం.. ఎంత మెజారిటీ వస్తది అనేది చూస్తున్నాం. మేము చెప్పిన మాట అమలు అవుతుందా లేదా గెలుచిన తర్వాత కూడా శ్రీనుకి అండగా ఉండి పర్యవేక్షిస్తాం..ప్రజలకు ఏమీ సేవ చేస్తారో చెప్పి బీజేపీ వాళ్ళు ఓట్లు అడగాలి అని మంత్రి హరీష్‌ విమర్శించారు.

- Advertisement -