నర్సాపూర్ పట్టణ ప్రగతిలో పాల్గొన్న మంత్రి హరీష్‌..

281
harish

మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నేడు పలు వార్డులలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, మాజీ మంత్రి సునీత లక్ష్మరెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ బస్టాండ్‌ వెనక ఉన్న కుంటను పరిశీలించారు.

కుంటను సుందరీకరించి వాకర్స్‌ ట్రాక్ గా తయారు చేయాలని, అందుకు అంచనాలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కుంటలోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బస్టాండు సమీపంలోని డ్రై న్లు పరిశీలించిన మంత్రి.. మున్సిపల్ ప్లాన్ ప్రకారం డ్రైన్లు ఉండాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.