సిద్ధిపేటలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలో మొదటి పునరావాస గ్రామాన్ని మంత్రి హరీశ్ రావు ఇవాళ ప్రారంభించారు. సిద్ధిపేట అర్బన్ మండలం లింగారెడ్డి పల్లి వద్ద నిర్మించిన కొచ్చగుట్ట పల్లి భూనిర్వాసిత గ్రామంలోని 130 ఇండ్లలో లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించి ప్రారంభించారు మంత్రి. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ZP చైర్మెన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ,సుడా ఛైర్మెన్ రవీందర్ రెడ్డి,పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మించుకోవడం ఎంతో ఆనందగా ఉంది.. ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన వారికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రాజెక్టు కోసం భూమి ఇవ్వడానికి మొదట ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు.
అనంతగిరి ప్రాజెక్టు నిర్వాసితులకు చేపలు పట్టుకునే హక్కులు కల్పిస్తాం. ఎల్లప్పుడూ అనంతగిరి రిజర్వాయర్ నీటితో నిండే ఉంటుంది. పునరావాస కాలనీకి రంగనాయకపురంగా నామకరణం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. కాళేశ్వరం నీళ్లు సూర్యాపేట జిల్లా వరకు వెళ్తున్నాయని మంత్రి అన్నారు.