స్వచ్ఛ్ తెలంగాణే సీఎం కేసీఆర్ ఆశయం- హరీష్‌రావు

596
minister harish rao
- Advertisement -

30 రోజుల ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్యే పద్మాదేవందర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం, పచ్చదనం కోసం ప్రతి గ్రామ పంచాయితీకి ఒక ట్రాక్టర్ ఇస్తున్నము. రాష్ట్రంలోనే అభివృద్ధిలో సంగారెడ్డి, మెదక్ జిల్లాలో పోటీ పడుతున్నాయి. ఈ రోజు మెదక్ జిల్లాలో 80 ట్రాక్టర్లు పంపిణీ చేశాం.ప్రతి పంచాయితీకి ట్రాక్టర్ ఇచ్చి స్వచ్ఛ్ తెలంగాణగా మార్చాలనేది సీఎం కేసీఆర్ ఆశయం అని మంత్రి అన్నారు.

30 రోజుల ప్రణాళికతో రాష్ట్రంలో ఏళ్ల నాటి దరిద్రం పోయింది. గత ప్రభుత్వాల్లో మాటలు కోటలు దాటినయి..చేతలు గడప దాటలేదు. 30 రోజుల ప్రణాళికను ఏడాదిలో మూడు సార్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారిశుద్ధ్యం నిర్ములించాడంలో జిల్లాలోని మల్కాపూర్ గ్రామం దేశంలోనే ఆదర్శoగా నిలిచింది. మల్కాపూర్ బాటలో అన్ని గ్రామాలు పయనించాలి.సమావేశానికి రాని పంచాయితి సెక్రెటరీ లకు సస్పెండ్,మెమో లు జారీ చేయాలని డిపిఓ కు మంత్రి ఆదేశించారు. మెదక్ జిల్లాను స్వచ్ఛ మెదక్ జిల్లాగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలి.ట్రాన్స్కో అధికారులు పని చేయలేదని మంత్రికి సర్పంచులు, ఎంపిటిసి లు పిర్యాదు చేశారు.

harish

దేశంలోనే 30 రోజుల ప్రణాళిక లాంటి కార్యక్రమం ఎక్కడ లేదు.మన పథకాలను కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. తండాలను పంచాయితీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. రైతు సంక్షేమనికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో గొప్ప పథకాలు అమలు చేస్తోంది. కాగా రైతులు పండించిన ప్రతి గింజను కోనుగోలు చేస్తామని..యాసంగికి రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

- Advertisement -