ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలిఃమంత్రి హరీశ్ రావు

218
harish rao
- Advertisement -

సిద్దిపేట జిల్లాలోని ఇరుకోడ్ గ్రామంలో పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేధించాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. ఈసందర్భంగా ఇరుకోడ్ గ్రామాన్ని స్వఛ్చ గ్రామంగా ప్రకటించారు మంత్రి. కార్యక్రమంలో మైనంపల్లి చెందర్ రావు,1969 తెలంగాణ ఉద్యమకారుడు ప్రతాప్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు.

ఈసందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఇరుకోడ్ జాతీయ ఉత్తమ గ్రామపంచాయితీగా రెండవసారి ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఇది గ్రామస్థులు సమిష్టిగా సాధించిన విజయం. ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని చెప్పారు. గ్రామంలో రెపటినుండి పేదవారు ఎవరు చనిపోయినా ఉచితంగా అంత్యక్రియలు జరిపించే కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు.

జాతీయ అవార్డు కింద వచ్చిన 8 లక్షల రూపాయలను ఇందుకోసం బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పారు. ప్రతిరోజు యోగ,ధ్యానం చేయాలి.. ఆరోగ్యానికి యోగా ఒక గొప్ప సాధనం..ఇందుకోసం ఉచిత యోగా తరగతులు ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చా,రు.

- Advertisement -