శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గంగుల ..

63
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి గంగుల కమలాకర్. కుటుంబ సమేతంగా ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి దంపతులకు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు స్వామివారి శేష పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ..మూడోసారి తెలంగాణలో టీఆర్ఎస్‌దే అధికారం అన్నారు. టీటీడీ సహకారంతో కరీంనగర్‌లో 10 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించబోతున్నామని….బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విమర్శలు చేసిన తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉంటారన్నారు.

- Advertisement -