చిరు – సల్మాన్ మాస్ స్టెప్స్‌!

74
- Advertisement -

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గాడ్‌ఫాదర్. మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతుండగా నయనతార, సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీ రోల్ పోషిస్తుండగా ఇందులో చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లపై ఓ ప్రత్యేకమైన సాంగ్ ఉండనుంది. ఈ పాట షూట్ కంప్లీట్ అయినట్టు మేకర్స్ ట్విట్టర్ వేదికగా అఫీషియల్‌గా ప్రకటించారు.

ఈ సాంగ్‌కి ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించగా ఈ పాటలో చిరు, సల్లూభాయ్ మాస్ స్టెప్స్ అభిమానుల్ని అలరించనున్నాయి. ఆగస్ట్ 22న చిరు, సల్మాన్ పాట లిరికల్ సాంగ్ ను విడుదల చేస్తారని సమాచారం.

- Advertisement -