బర్త్ డే….మొక్కలు నాటిన మంత్రి గంగుల..

199
gangula
- Advertisement -

తన పుట్టినరోజును పురస్కరించుకొని శుభాకాంక్షలు అందజేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి, గవర్నర్ శ్రీ తమిళిసై గారికి ధన్యవాదాలు తెలియజేశారు మంత్రి గంగుల కమలాకర్. రాష్ట్రాన్ని అభివ్రుద్ది పథంలో తీసుకెళ్తూ, ప్రజల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రిగారి ఆశిస్సులు తనకు నూతనోత్తేజాన్ని అందించాయని పేర్కొన్నారు, ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో బాగంగా మినిస్టర్ క్వార్టర్స్ ఆవరణలో మెక్కను నాటారు.

తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ కవిత గారికి, వివిద రూపాల్లో శుభాకాంక్షలు తెలియజేసిన సహచర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, వివిద ప్రజాప్రతినిధులకు, నేతలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు, కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా తీవ్రంగా ఉన్న ప్రస్థుత పరిస్థితుల్లో జన్మధిన వేడుకలకు దూరంగా, నిరాడంబరంగా కుటుంబ సబ్యులతో కలిసి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు మంత్రి గంగుల కమలాకర్.

- Advertisement -