KCR:మతపిచ్చి బీజేపీకి బుద్ది చెప్పండి

31
- Advertisement -

కరీంనగర్‌కు బీఆర్ఎస్‌ పార్టీకి విడదీయరాని అనుబంధం ఉందన్నారు సీఎం కేసీఆర్. చాలా కార్యక్రమాలు ఇక్కడి నుండే ప్రారంభిస్తే విజయవంతం అయ్యాయన్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం..ఇదే గ్రౌండ్‌ వేదికగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందన్నారు. 2001లో ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ వేదికగానే ఉద్యమం ప్రారంభమైందని గుర్తు చేశారు.

కరీంనగర్‌ ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు సీఎం కేసీఆర్.గత పదేళ్లలో ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల అభివృద్ధి సాధించగలిగామన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ 1గా ఉందన్నారు. కరీంనగర్ ప్రజలు చైతన్య వంతులైన ప్రజలని..ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థితో పాటు పార్టీల గురించి ఆలోచించాలన్నారు. మానేర్ రివర్ ఫ్రంట్ పూర్తియితే పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు.

పొరపాటున కాంగ్రెస్ వస్తే ఆగమాగం అవుతామన్నారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసిన రాబోయేది బీఆర్ఎస్ సర్కారే అన్నారు. కాంగ్రెస్ అంటేనే దొఖేబాజీ పార్టీ అన్నారు. 58 ఏండ్లు ప్రజలను ఇబ్బందులు పెట్టిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. బీజేపీ అంటే మతపిచ్చి పార్టీ అన్నారు. ఆ పార్టీకి మతచిచ్చు పెట్టడం తప్ప అభివృద్ధి గురించి తెలియదన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలన్నారు. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పాసైన ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదన్నారు.

Also Read:మెంతినీరు త్రాగితే ఎన్ని లాభాలో..!

ఒకసారి పొరపాటు చేసినందుకే 5 ఏండ్లుగా బీజేపీ ఎంపీతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. గతంలో వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలన్నారు. ప్రస్తుత ఎంపీ మసీదులు తొవ్వుదాం అని రెచ్చగొట్టడం తప్ప చేసింది శూన్యం అన్నారు. దేశానికి కావాల్సింది అభివృద్ధా…మసీదులు తవ్వడమా ఆలోచించాలన్నారు. గురుకుల పాఠశాలతో విద్యావ్యవస్థలో గణనీయ ప్రగతి సాధించామన్నారు. ఇది ప్రగతి అంటే కానీ మత పిచ్చితో తాకట్టు పెట్టడం అభివృద్ధి కాదన్నారు. కులం ,మతం తేడా లేకుండా కలిసి బ్రతకాలన్నదే తమ విధానం అని..ఈ రాష్ట్రాన్ని విచ్చిన్నం చేస్తున్న శక్తులకు కర్రు కాల్చి వాతపెట్టాలన్నారు. ఈ ఎన్నికలతో బీజేపీ బుద్ది చెప్పాలని కోరారు సీఎం కేసీఆర్.

Also Read:MLC Kavitha:జై తెలంగాణ ఎందుకు అనరు?

- Advertisement -