కరోనా వైరస్ రాష్ట్రంలోకి వచ్చిన మొదటి రోజు నుండి హెల్త్ వారియర్స్ కంటిమీద కునకులేకుండా పని చేస్తున్నారని వైద్యాధికారులను కొనియాడారు మంత్రి ఈటల రాజేందర్. ఎస్ ఆర్ నగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో జూమ్ విడియో కాన్ఫరెన్స్ ద్వారా 22 వేల మంది ఆశా వర్కర్స్, 500 మంది ANM లతో మాట్లాడారు ఈటల రాజేందర్.
6 నెలల అనుభవంలో కరోనా కి చంపే శక్తి లేదు అని తెలిసిపోయిందని…. 99 శాతం మంది బయటపడుతున్నారు.కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోకి వచ్చింది. భయం లేకుండ ఎదుర్కొంటే కరోనా ను జయించవచ్చు ఈ ధైర్యాన్ని ఆశా వర్కర్లు, ANM లు ప్రజలందరికీ కల్పించాలన్నారు.ప్రపంచంలో ఎక్కడ అయిన కరోనా కి చికిత్స ఒక్కటే.. అనవసరంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్లాస్మా థెరపీ కూడా చేస్తున్నాము.గ్రామాల్లో కరోనా పాజిటివ్ వ్యక్తులను మొదటి రోజే గుర్తించ గలిగితే వ్యాప్తి నీ అరికట్టవచ్చు, ప్రాణాలు కాపాడవచ్చు.గ్రాండ్ లెవల్ లో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ దీని మీద పూర్తి అవగాహన వచ్చిందన్నారు.
ప్రజలను కూడా చైతన్య పరిచి అతి త్వరలో పూర్తి గా అడ్డుకట్ట వేద్దాం.ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కూడా ప్రజల భాగస్వామ్యం తోనే ఇలాంటి వ్యాధులను ఎదుర్కోగలం అని పదే పదే చెప్తున్నారు.ఇతర సీజనల్ వ్యాధులు, కరోనా ఒకటే లక్షణాలు కలిగి ఉంది కాబట్టి సాధ్యమైనంత తొందరగా పరీక్షలు చేసి నిర్ధారణ చేసుకోవాలి.రాపిడ్ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారికి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా RTPCR పరీక్ష చేయించాలి.అప్పుడే రిలాక్స్ అవ్వవద్దు జనవరి వరకు ఇదే స్ఫూర్తి తో పని చేయాలన్నారు.
కరోనాతో పాటు ఇతర వైద్య సేవలు కూడా అందించాలి.దేశంలో అత్యంత సమర్థవంతంగా పని చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఇది మనకి గర్వ కారణం.వైద్య సిబ్బంది అందరి వల్లనే ఇది సాధ్యం అయ్యింది.కొవిద్ సమయంలో పనిచేయడం మీ అందరికీ గొప్ప జ్ఞాపకం.భరోసా కల్పించండి ప్రాణాలు కాపాడండి అంటూ ఆశా, ఏ ఎన్ ఎం లకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.