ఈటల భూఆక్రమణ నిజమే: కలెక్టర్ హరీష్

130
etela
- Advertisement -

మంత్రి ఈటల ఆక్రమించింది అసైన్డ్ భూమే, ఇది చట్టరిత్యా నేరమని వెల్లడించారు మెదక్ కలెక్టర్ హరీష్. సర్వే నెంబర్ 130లో అసైన్డ్ చట్టాలకు వ్యతిరేకంగా జమునా హెచరీస్‌కు సీతారామారావు నుండి 3 ఎకరాల భూమిని రిజిస్టర్ చేయించారని వెల్లడించారు. అచ్చంపేటలో బాధితుల నుండి వివరాలను సేకరించామని మూడు- 4 గంటల్లో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని వెల్లడించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో శనివారం ఉదయం మాసాయిపేట మండలం అచ్చంపేటకు చేరుకున్న అధికారులు.. మంత్రిపై ఫిర్యాదు చేసిన రైతుల నుంచి వివరాలు సేకరించారు. తూప్రాన్‌ ఆర్డీవో రాంప్రకాశ్‌ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలతో గ్రామంలోని భూములను సర్వే చేశారు. మంత్రి ఈటలకు చెందిన హేచరీస్‌లో, దాని పక్కనే ఉన్న అసైన్డ్‌ భూముల్లో డిజిటల్‌ సర్వే నిర్వహించారు.

- Advertisement -