ప్రభాస్ రెమ్యునరేషన్ రూ. 100 కోట్లా!

125
prabhas

వర్షం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. పాన్ ఇండియన్ మూవీలకు కేరాఫ్‌గా మారిన ప్రభాస్‌ రెమ్యునరేషన్‌ గురించి ఇప్పుడు చర్చంతా నడుస్తోంది.

సాహో తర్వాత రాధే శ్యామ్ ,ఆదిపురుష్ సినిమాలు చేస్తున్న ప్రభాస్‌….తన సినిమాలకు షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆదిపురుష్‌ మూవీ కోసం ప్రభాస్ ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. టీ-సిరీస్ నిర్మిస్తున్న ఈ మూవీ గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది.

ఇదే నిజం అయితే ఇండియన్‌ ఫిల్మ్ హిస్టరీలో ఇంత భారీ రెమ్యునరేషన్ అందుకున్నఫస్ట్ హీరోగా ప్రభాస్ చరిత్రలో నిలిచిపోనున్నాడు. ఈ విషయంలో ప్రభాస్ తర్వాతి స్థానాల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఉన్నారు.