Etela:ఈటెల జంప్..హింట్ ఇచ్చినట్లే?

25
- Advertisement -

బీజేపీ నేత ఈటెల రాజేందర్ పార్టీ మారబోతున్నారంటూ గత కొన్నాళ్లుగా వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇలాంటి వార్తలు వైరల్ అయిన ప్రతిసారీ ఆయన ఖండిస్తూనే ఉన్నారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని, బీజేపీని వీడే ప్రసక్తే లేదని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. అయినప్పటికి రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అయితే ఇలా రూమర్స్ రావడానికి కూడా కారణం లేకపోలేదు. ఎందుకంటే పార్టీ వ్యవహారాల్లో ఈటెల పెద్దగా స్పందించడం లేదు. గతంలో ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొంతకాలం అలకబూనారు కూడా. అయితే ఎన్నికల ముందు ఊహించని విధంగా ఈటెలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది అధిష్టానం. స్టార్ క్యాంపైనర్ చేయడం, ఎలక్షన్ కమిటీ చైర్మన్ హోదా.. ఇలా ఆయా పదవులు ఇస్తూ ఈటెలను బాగానే హైలెట్ చేసింది..

అయితే అనూహ్యంగా రెండు చోట్ల పోటీ చేసిన ఈటెల.. రెండు చోట్ల కూడా ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. ఇక అప్పటి నుంచి పార్టీలో ఈటెల ప్రస్తావనే కరువైంది. పైగా పలు మార్లు తనను పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్వయంగా ఈటెలనే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అడుగులు కాంగ్రెస్ వైపు వెళుతున్నాయనే చర్చ జోరుగానే సాగింది. ఆ వార్తలకు బలం చేకూర్చేలా.. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పట్నం నరేందర్ రెడ్డి మరియు మైనంపల్లి హనుమంతరావు లతో ఈటెల భేటీ అయ్యారు. ఈ సమావేశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే బీజేపీ విషయంలో అసంతృప్తిగా ఉన్న ఈటెల కాంగ్రెస్ లో చేరడం కోసమే వారితో సమావేశం అయ్యారా ? అనే గుసగుసలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికి కాంగ్రెస్ నేతలతో భేటీ కావడం పార్టీ మార్పుపై ఈటెల హింట్ ఇచ్చినట్లేనని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Also Read:ఆరోపణలు నిరూపిస్తే..అసెంబ్లీకి రాను:హరీష్

- Advertisement -