- Advertisement -
సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షలు, డిశ్చార్జ్ లు, హోమ్ ఐసోలేషన్, పేషంట్లకు అందిస్తున్న బోజనం, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం అందిచాల్సిన సహకారంపై మంత్రి ఈటెల సమీక్షించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ యోగితా రాణా, డీఎంఈ డా రమేష్ రెడ్డి, డీపీహెచ్ డా శ్రీనివాసరావు, టీఎస్‌ఎంఐడీసీ ఎండి చంద్రశేకర్ రెడ్డి, సి ఈ లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు.
- Advertisement -