దేశంలోనే అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం నీళ్లను మొదటగా ముద్దాడేది కరీంనగర్ జిల్లానే అన్నారు వైద్యా, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెందర్. నేడు కరీంనగర్ లో పర్యటించిన మంత్రి ఈటెల మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభంతో రైతుల కళ్ళలో ఆనందం చూస్తున్నామని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టాలంటే 20ఏండ్లు పట్టింది..కానీ సీఎం కేసీఆర్ పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి కేవలం మూడు సంవత్సరాల సమయం పట్టిందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మిడ్ మానేరు డ్యాం పూర్తయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఈఏడాది పంట పొలాలకు నీరందుతుందని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి దేశంలో నే తెలంగాణ వ్యవసాయ రాష్ట్రం గా అవిర్భవించబోతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెడుతున్న పథకాలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు.