షూటింగ్ లో నాగార్జున నేను కొట్టుకున్నాంః జేడీ చక్రవర్తి

346
Nagarjuna Jd Chakravathi
- Advertisement -

జేడీ చక్రవర్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. వెండితెరపై హీరోగా, విలన్ గా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొద్ది రోజులుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న జేడీ చక్రవర్తి ఆర్ఎక్స్ 100హీరో కార్తికేయ నటించిన హిప్పి మూవీలో కీలక పాత్రలో నటించాడు. ఈసందర్భంగా ఓ ఇంటర్యూలో పాల్గోన్న ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. శివ షూటింగ్ సమయంలో నాగార్జున నేను కొట్టుకున్నాం అని చెప్పారు.

లంచ్ తర్వాత నాగార్జున గారు షూటింగ్ కి వస్తున్నారు. అప్పుడు నేను ఇరానీ కేఫ్ లో నుంచి బయటకు వస్తున్నా. ఆయన రావడం నేను చూడలేదు..అనునకోకుండా నా చేయి ఆయన భుజానికి తగిలింది. అప్పుడు నాగార్జున నా దగ్గరికి వచ్చి ఏయ్ ఎటు చూసి నడుస్తున్నావ్ అని అన్నారు. దీంతో నేను చూసుకోలేదండి అని చెప్పేశా..ఆతర్వాత నాగార్జున నన్ను తగిలిన వెంటనే సారీ చెప్పడం తెలిదా అని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నవ్..మర్యాదగా మాట్లాడు అని అన్నారు. దీంతో నేను కూడా మీరు మర్యాదగా మాట్లాడండి అన్నారు.

ఏంటిరా ఎక్కువగా మాట్లాడుతున్నావ్ అని నన్ను లాగి కొట్టారు నాగార్జున. దీంతో నేను వెంటనే ఆయన కాలర్ పట్టుకున్నా. ఇద్దరం ఒకరి కాలర్ ఒకరం పట్టుకుని కొట్టుకున్నాం. నాగార్జున గారు నేను కొట్టుకోవడం చూసిన ఆన్నపూర్ణ డ్రైవర్లు నన్ను కొట్టాడానికి రాడ్లు తీసుకుని వచ్చారు. అప్పుడు నాగార్జున వాళ్లను అక్కడి నుంచి వెళ్లిపొండి అని చెప్పారు.

- Advertisement -