ఈటల భూకబ్జా…సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు

187
Minister Etela
- Advertisement -

మంత్రి ఈటల రాజేందర్ భూ వివాదంలో చిక్కుకున్నారు. అసైన్డ్ భూములను ఆక్రమించి అడ్డంగా దొరికిపోయారు. ఈటల భూకబ్జా వ్యవహరాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి బాధితులు తీసుకెళ్లడంతో విచారణకు ఆదేశించారు.

2016లో మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో తొలుత 40 ఎకరాలను సేకరించిన ఈటల రాజేందర్‌.. అక్కడ జమున హ్యాచరీస్‌ పేరుతో ఒక కోళ్లఫారాన్ని ఏర్పాటుచేశారు.తర్వాత 2017లో మరో పది ఎకరాల భూమిని, ఆ తర్వాత మరో 50 ఎకరాలను చుట్టుపక్కల రైతుల నుంచి తీసుకున్నారు. ఇలా సేకరించిన భూమిని ఈటల రాజేందర్‌ తన భార్య జమున, కుమారుడు నితిన్‌రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించారు.

అసైన్డ్‌ భూములను రైతుల నుంచి తీసుకోవడమే ఇప్పుడు వివాదానికి మూలమయ్యింది. దీంతోపాటు అసలు ఈ కోళ్లఫారానికి వెళ్లడానికి దళితులు, బీసీలకు చెందిన భూమిలోంచి రోడ్డు వేశారు. హైదరాబాద్‌కు కేవలం గంట ప్రయాణ దూరంలో ఉన్న హకీంపేట, అచ్చంపేటల్లోని భూమిని ఎకరాకు రూ.2లక్షల చొప్పున కూడా సేకరించారని రైతులు ఆరోపిస్తున్నారు.

అయితే, ఇక్కడ జమునా హ్యాచరీస్‌ పేరుతో కోళ్లఫారం మొదలైన తర్వాత ఇక్కడి దళితులకు తమ భూముల్లోకి వెళ్లడానికి ఇబ్బందులు మొదలయ్యాయి. అసైన్‌మెంట్‌ భూములను తమకు అప్పగిస్తే సరి.. లేకపోతే మీరు మీ పొలాల్లోకి వెళ్లేందుకు వీల్లేదంటూ హ్యాచరీస్‌ నిర్వహిస్తున్న ఈటల రాజేందర్‌ మనుషులు స్థానికులను అడ్డుకోవడం మొదలుపెట్టారని బాధితులు చెప్తున్నారు. పలుమార్లు ఇక్కడి స్థానికులు ఎమ్మార్వో ఆఫీసుకు, పోలీసుస్టేషన్‌కు కూడా వెళ్లారు. కానీ, వారికి అక్కడ న్యాయం దక్కలేదు. దీంతో వారు సీఎంకు ఫిర్యాదుచేయగా విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

- Advertisement -