కరోనా కల్లోలం.. ఏపీలో ఒక్కరోజే 17,354 కేసులు నమోదు..

39
coronavirus

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సెకండ్ వేవ్‌లో కొత్త కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో 86,494 కరోనా పరీక్షలు నిర్వహించగా 17,354 మందికి పాజిటివ్ అని తేలింది. అదే సమయంలో రాష్ట్రంలో 8,468 మంది కరోనా నుంచి కోలుకోగా, 64 మంది మృతి చెందారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,01,690కి చేరింది. ఓవరాల్ గా 9,70,718 మంది కోలుకోగా, ఇంకా 1,22,980 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,992కి పెరిగింది. గడచిన 24 గంటల్లో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మరికొన్ని జిల్లాల్లో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు గుర్తించారు.