రైతుల వెంటే సీఎం కేసీఆర్: మంత్రి ఎర్రబెల్లి

150
errabelli
- Advertisement -

రైతుల వెంటే సీఎం కేసీఆర్ ఉంటారని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నూతన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఇచ్చిన భారత్‌ బంద్‌లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో కలిస బంద్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు లేనిదే రాజ్యం లేదని….ఎద్దు ఏడ్చిన వ్యవసాయం-రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని విమర్శించారు.

రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ రోడ్డుపై బైఠాయించి రైతులకు మద్దతుగా నిరసన తెలిపిరోడ్డు మీదే వంటా వార్పు నిర్వహించారు. జై జవాన్-జై కిసాన్ అంటూ రైతులతో కలిసి నినాదాలు చేశారు.

- Advertisement -