- Advertisement -
వరంగల్ రూరల్ జిల్లాలోని పర్వతగిరి మండల కేంద్రంలోని ఆవుకుంట చెరువులో ఉపాధి హామీ పనులను పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఉపాధి కూలీలతో కలిసి పనిచేసిన ఎర్రబెల్లి తర్వాత వారితో ముచ్చటించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి ..అడిగినవారందరికి ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
ఉపాధి హామీ పనుల విషయమై వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరితతో మాట్లాడిన ఎర్రబెల్లి …ఎక్కువమందికి పని కల్పించాలని సూచించారు. కొత్తగా వచ్చిన కూలీలకు సైతం పనులు కల్పించాలన్నారు.
- Advertisement -