- Advertisement -
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోన్ని అన్ని చెరువులు,కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామంలో వర్షానికి దెబ్బతిన్న పత్తి, వేరుశనగ పంట, ఖానాపురం మండలం పాకాల చెరువు మత్తడి నీటి ప్రవాహంతో దెబ్బతిన్న వరి పంటలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి…. చెరువు ముంపు ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అవసరమైతే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు.
- Advertisement -