గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న తాగుబోతు రమేష్…

33
ramesh

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు కమెడియన్ తాగుబోతు రమేష్.సిడ్ గణేష్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు కమెడియన్ తాగుబోతు రమేష్ కు విత్తన గణపతిని అందజేసింది టీ న్యూస్ సిబ్బంది.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటనని కమెడియన్ తాగుబోతు రమేష్ అన్నారు. పచ్చని చెట్లే ప్రగతికి మెట్ల అనే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ నటుడు భూపాల్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ గచ్చిబౌలి లోని తన నివాసంలో మొక్కలు నాటిన కమెడియన్ తాగుబోతు రమేష్. అనంతరం మరో ముగ్గురు ( కమెడియన్ లు చమ్మక్ చంద్ర , వేణు వండర్ , నటుడు రవి వర్మ ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.