జయశంకర్ సార్‌ జీవితం అందరికీ ఆదర్శం: ఎర్రబెల్లి

338
minister errabelli
- Advertisement -

జ‌య‌శంక‌ర్ సార్ జీవితం యువ‌త‌కు ఆద‌ర్శం, స్ఫూర్తి దాయ‌కం అని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు పట్టణ కేంద్రంలో ఆచార్య జయశంకర్ సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన ఎర్రబెల్లి… జయశంకర్ సార్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేశారన్నారు.

కేసీఆర్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తే, జయశంకర్ సార్ సిద్ధాంత కర్త గా ఉన్నారన్నారు. వారి చిరకాల స్వప్నం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అని సార్ శిష్యులు ఈ రోజు అన్ని రంగాల్లో ఉన్నారని తెలిపారు. న్నారన్నారు. జ‌య‌శంక‌ర్ సార్ మా నాన్న నారాయణరావు మంచి స్నేహితులు. నా బాల్యంలో వారి ఇంట్లోనే ఒక నెల వుంచి నన్ను చదివించరన్నారని నాటి అనుభూతులను గుర్తు చేసుకున్నారు.

ప్రత్యేక రాష్ట్ర సాధ‌న‌లో ఆయ‌న చేసిన సూచ‌న‌లు, స‌ల‌హాలు భ‌విష్యత్ త‌రాల‌కు మార్గదర్శకాలు అయ్యాయన్నారు. సార్ యావజ్జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. జ‌య‌శంక‌ర్ ఆశ‌యాల‌నే ఆదేశిక సూత్రాలుగా సీఎం కేసీఆర్ తెలంగాణ‌ను బంగారు తెలంగాణ‌గా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.

- Advertisement -