సీఎం కేసీఆర్…మనసున్న మారాజు: తలసాని

207
talasani srinivas

సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అని కొనియాడారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పెద్దపల్లి జిల్లాలోని అంతర్గం మండలం కుందనపల్లిలో గొర్రెలు, మేకల మార్కెట్ యాడ్ నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు సీఎం కేసీఆర్.

ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని… 18 సంవత్సరాలు నిండిన ప్రతి గొల్ల కురుమకు గొర్రెలు అందజేస్తున్నామని విరించారు. ప్రభుత్వం తరఫున 80% బీమా వసతి కల్పిస్తామని పేర్కొన్నారు.

నాలుగున్నర ఎకరాల్లో రూ.25 లక్షల వ్యయంతో మార్కెట్ యార్డ్ నిర్మాణం చేపడుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, స్థానిక శాసన సభ్యుడు కోరుకంటి చందర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.