ధైర్యంగా ఉందాం కరోనాను జయిద్దాం: ఎర్రబెల్లి

112
dayakarrao

మన మనో ధైర్యమే మనకు రక్ష అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మనం ధైర్యంగా ఉందాం – కరోనా ను జయిద్దాం అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని కరోనా బాధితులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఎర్రబెల్లి…ఆందోళ‌న వ‌ద్దు… అంద‌రికీ అండ‌గా నేను, నా సిబ్బంది ఉంటామని భరోసా ఇచ్చారు.

క‌రోనా స‌మ‌యంలో ర‌క్తం ఎంతో ముఖ్య‌మైన‌ద‌న్నారు. ప్లాస్మాతో అనేక మందిని కాపాడే అదృష్టం అంద‌రికీ రాద‌న్నారు. ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల్ల అనారోగ్యాలు రావ‌న్నారు. ర‌క్త‌దానం చేసిన ప్ర‌తి ఒక్క‌రినీ మంత్రి స్వ‌యంగా వ‌ద్ద‌కు వెళ్ళి ప్ర‌శంసించారు.