గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌..

185
gic

తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ విసిరిన చాలెంజ్ స్వీకరించి తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు కోరుకంటి చందర్.

ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ మొక్కలను విరివిగా పెంచుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తు, సమతుల్యతను పెంపొందించే విధంగా అందరూ కృషి చేయాలని, తన రామగుండం నియోజకవర్గం విపరీతమైన కాలుష్యానికి నిలయంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త 3మొక్కలు నాటుతు వాతావరణ సమతుల్యతను పెంపొందిస్తూ తన నియోజకవర్గంలోని కాలుష్యాన్ని కొంతమేరకు నివారించాలని ప్రతి ఒక్క కార్యకర్తను కోరారు. ఈ సందర్భంగా తనను మొక్కలు నాట వలసిందిగా కోరిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశవ్యాప్తంగా ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ వాతావరణ సమతుల్యత పెంచేందుకు కృషి చేస్తున్నారు సంతోష్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఉద్యమం ఇలానే కొనసాగాలని నిమ్మల ప్రవీణ్ యుఎస్ఏ , బిత్తిరి సత్తి ఫేమస్ ఆర్టిస్ట్ & హీరో , నారాయణ అర్జీ 1 జీఎం , సాగర్ ఆర్కే నాయిడు , తాగుబోతు రమేష్ కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇచ్చారు.