బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది….ఫస్ట్ లుక్

194
shakalaka shanker

కామెడీ హీరో షకలక శంకర్ లీడ్ రోల్ లో న‌టిస్తోన్న‌ చిత్రం బొమ్మ అదిరింది- దిమ్మ తిరిగింది.ఈ సినిమాతో కుమార్ తోట దర్శకుడిగా పరిచయం అవుతుండగా సినిమా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఫుల్ కామెడి అండ్ రొమాంటిక్ ఎంటరైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా నిర్మాతలు లుకాలపు మధు, దత్తి సురేష్ బాబు, సోమేశ్ ముచ‌ర్ల‌ తెలిపారు. షకలక శంకర్ నుంచి ఆడియన్స్ ఎక్సపెక్ట్ చేసే కామెడి తో పాటు మరి కొన్ని థ్రిల్ ఎలెమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నట్లుగా చెబుతున్నారు దర్శకుడు కుమారు కోట.

షకలక శంకర్ తో పాటు ప్రియ, అర్జున్ కళ్యాణ్, రాజు స్వరూప్, స్వాతి తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లుక్ తాజగా గా విడుదల అయింది. దర్శకుడు కుమార్ కోట మాట్లాడుతూ..ఇది డైరెక్టర్ గా నా తొలి సినిమా, ఈ సినిమాని ఓ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ రొమాంటిక్ కమర్షియల్ స్టోరీ తో తెర‌కెక్కించాము. షకలక శంకర్ మార్క్ కామెడీ అండ్ యాక్షన్, ఆడియన్స్ ని తప్పకుండా అలరిస్తుంది అని ఆశిస్తున్నానని చెప్పారు.