పబ్బులు, క్లబ్బుల్లో తిరిగే కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి రైతుల గురించి మాట్లాడే హక్కులేదని మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ నెల 7వ తేదీన మంత్రి కె టి రామారావు సందర్శించనున్న హనుమకొండ నయీం నగర్ లోని సాప్ట్ పాత్ ఐటీ ఆఫీస్ ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు తదితరులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. పబ్బలు, క్లబ్బుల్లో తిరిగే రాహుల్ గాంధీకి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. UPA-కాంగ్రెస్ పాలనలో దేశంలో 1,58,117 మంది రైతులు చనిపోయారు..తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రేస్ పాలనలో 18 వేల మంది రైతులు చనిపోయారన్నారు. వారి రైతు వ్యతిరేక విధానాల వల్ల అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పేరుకే 7 గంటల కరెంటు కాని, వచ్చింది 3 గంటలే… అందులోనూ కోతలే అన్నారు. కరెంటు లీగలపై బట్టలు ఆరేసుకునే పరిస్థితి ఉండేదని…పొలాల్లో పని చేసుకుంటూ పాముకాటుకు, కరెంటు షాకుకు గురై చనిపోయే వాళ్ళు అన్నారు. నిజామాబాద్ లో ఎర్రజొన్న రైతులకు కాల్చి చంపించింది కాంగ్రెస్ వాళ్ళు కాదా? అని ప్రశ్నించారు.