దాతలు ముందుకు రావాలి : మంత్రి ఎర్రబెల్లి

305
minister errabelli
- Advertisement -

క‌రోనా వైరస్ నిర్మూల‌న వంటి విత‌ప్క‌ర ప‌రిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడానికి దాతలు తమ విరాళాలతో ముందుకు వచ్చి ధాతృత్వాన్ని చాటుకోవాల‌ని దాత‌ల‌కు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పిలుపునిచ్చారు.

అపన్నులని ఆదుకోవడంలో ముందుండాలని ఆయన అన్నారు. క‌రోనా నిర్మూల‌న కోసం సిఎం కెసిఆర్ ప‌డుతున్న శ్ర‌మ‌ని ఆయ‌న గుర్తు చేశారు. దేనికీ వెర‌వ‌కుండా ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డానికే ప్ర‌థ‌మ ప్రాధాన్య‌మిస్తున్న సిఎం కెసిఆర్ కి, ప్ర‌భుత్వానికి అండ‌గా నిలుస్తున్న‌వాళ్ళంద‌రినీ మంత్రి అభినందించారు.

ఈ సంద‌ర్భంగా వరంగల్ కి చెందిన హై కోర్టు అడ్వకేట్ ఇ శివరావు, హైదరాబాద్ లో గల మంత్రుల నివాస ప్రాంగణంలోని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని కలిసి రూ. లక్ష ను విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు చెక్కుని మంత్రి గారికి అందించారు. పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా వైరస్ నిర్మూలన కు ఉపయోగించాలని శివరావు మంత్రి ని కోరారు. అందుకు మంత్రి ఎర్ర‌బెల్లి శివరావు కి కృత‌జ్ఞ‌తలు తెలిపి అభినందించారు.

- Advertisement -