- Advertisement -
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. హనుమకొండ, రాంనగర్ లోని ఆయన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి టపాకాయలు సంబరాలు జరుపుకున్నారు.
ఈ సంధర్భంగా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని మంత్రి దయాకర్ రావు ఆకాంక్షించారు.చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దీపావళి జరుపుకోవడం మన సంప్రదాయమన్నారు. సమృద్ధికి సంకేతమైన లక్ష్మీదేవిని ఆరాధించడం, కేదారీశ్వర వ్రతాలు చేసుకుంటూ దీపావళి పండగ విశిష్టతను కొనసాగించడం అభినందనీయమని అన్నారు. ప్రజలందరు పండుగను సంతోషంగా జరుపుకోవాలని, టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకొవాలని మంత్రి సూచించారు.
- Advertisement -