ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో అత్యంత విజయవంతంగా నిర్వహించి, మన తెలంగాణను దేశంలో నెంబర్ వన్‌గా నిలిపిన అధికారులు, ఉద్యోగులు, ఉపాధి కూలీలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఖైరతాబాద్‌లోని ఉపాధి హామీ పథకం అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్స్ క్యాలెండర్ 2021ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…కరోనా సమయంలో నగరాలు, పట్టణాల నుంచి పల్లెల కు వాపస్ వలస వచ్చిన వాళ్లందరికి ఉపాధి కల్పించడం ఓ రికార్డ్ అన్నారు. లక్షలాది ఉపాధి హామీ జాబ్ కార్డులు కూడా కొత్తగా ఇచ్చామని తెలిపారు. ఇది కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సాధించిన అద్భుతం అని మంత్రి వివరించారు.
దేశంలో అత్యధికంగా 18కోట్ల పని దినాలను పూర్తి చేసిన ఘనత తెలంగాణది అన్నారు. ఈ ఘనత మన అందరిది. దీన్ని సాధించిన తీరు అమోఘమని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తిని ఉపాధి హామీ అధికారులు, ఉద్యోగులు కొనసాగించాలని మంత్రి సూచించారు.