రవళి కుటుంబాన్ని ఆదుకుంటాం :మంత్రి ఎర్రబెల్లి

257
Ravali Errabelli
- Advertisement -

వరంగల్ నగరంలో ప్రెమోన్మాది చేతిలో గాయపడ్డ రవళి నిన్న సాయంత్రం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆరు రోజులు ప్రాణాలతో కొట్టుమిట్టాడిన రవళి చివరకు తుదిశ్వాస విడిచింది. గత నెల 27న వరంగల్ లోని వాగ్దేవీ కాలేజీకి వెళుతున్న రవళిపై అన్వేష్ పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. రవళి శరీరం 80శాతం కాలిపోవడంతో వైద్యులు కూడా ఎం చేయలేకపోయారు. మొదట వరంగల్ నగరంలోని ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స చేయగా..అనంతరం మెరుగైన వైద్య సేవలకోసం హైదరబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. రవళి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రినుంచి స్వగ్రామమైన వరంగల్ జిల్లా రామచంద్రపురానికి తరలించారు.

ఈసందర్భంగా ఆసుపత్రికి వెళ్లి రవళి మృతదేహాన్ని పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న రవళి బంధువులను ఓదార్చారు. రవళి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఆసుపత్రిలో చేరిన మొదటి రోజు నుంచే రవళి ఆరోగ్యం విషయంగా ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి. రవళి వైద్యానికి అయిన ఖర్చులను మొత్తం తెలంగాన ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. రవళిపై పెట్రోల్ తో దాడి చేసిన అన్వేష్ పై కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -