- Advertisement -
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామి వారిని కోరినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని కరోనా భారినపడ్డ ప్రజలు కూడా త్వరగా కోలుకొవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి వెంట నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు.
- Advertisement -