నీట్‌ పీజీ పరీక్షలు వాయిదా..

187
NEET PG 2021 exam
- Advertisement -

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు 10,12 తరగతలు పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్‌ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ) పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. నీట్‌ పీజీ పరీక్షలు నాలుగు నెలల పాటు వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌ 31న పరీక్ష నిర్వహించలేమని. ఎగ్జామ్‌ డేట్‌ ప్రకటించిన తర్వాత విద్యార్థులకు ఒక నెల రోజులు వ్యవధి ఇస్తాం. ఆ తర్వత పరీక్ష నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.

ప్రధాని మోదీ అధ్యక్షతన కరోనాపై సమీక్షా సమావేశం జరిగిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వెలువడింది. పరీక్షల వాయిదా కనీసం నాలుగు నెలలు ఉంటుందని… ఈ నిర్ణయం ద్వారా ఎంతో మంది డాక్టర్లు కరోనా పేషెంట్లకు చికిత్స చేసే విధుల్లో ఉంటారని ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. వైద్య రంగంలోని వారు కనీసం 100 రోజుల పాటు కోవిడ్ విధుల్లో ఉండేందుకు ఈ నిర్ణయం సహకరిస్తుందని పేర్కొంది.

- Advertisement -