హరిత తెలంగాణే సీఎం కెసిఆర్ లక్ష్యంఃమంత్రి ఎర్రబెల్లి

568
errabelli dayakar rao
- Advertisement -

హరిత తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నేడు పాలకుర్తి మండల కేంద్రంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఒక్కో మండలానికి రెండు కోట్ల రూపాయల పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. ఎన్నికల హామిలో భాగంగా పెన్షన్లు పెంచి సీఎం కేసీఆర్ ఇచ్చన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందిందన్నారు. రైతులకు 24గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు.

పాలకుర్తి నియోజకవర్గ అభివృద్దే నా లక్ష్యం…నామీద నమ్మకంతో నన్ను గెలిపించిన పాలకుర్తి ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్ట్ లు కడితే 10సంవత్సారాలు అయినా పూర్తి కాలేదని..కానీ కేసీఆర్ పట్టుదలతో కేవలం 3ఏండ్లలోనే కాళేశ్వరం పూర్తి చేశారన్నారు. గోదావరి జలాలతో 365 రోజులు చెరువులన్నీ మత్తడి పోసేలా చేస్తున్నామని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

- Advertisement -