దేశాన్ని ఆక‌లి రాజ్యం చేసే విధంగా కేంద్ర విధానాలు- మంత్రి ఎర్రబెల్లి

66
errabelli
- Advertisement -

అన్న‌దాత‌కు వెన్నుద‌న్నుగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ, తెలంగాణ ప్ర‌భుత్వం, రైతు వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంబిస్తున్న కేంద్రంపై శాంతియుత జంగు సైర‌న్ ఊదింది. వ‌ర‌స‌గా నిర‌స‌న కార్య‌క్ర‌మాలకు శ్రీ‌కారం చుట్టింది. స్వ‌యంగా ఆ పార్టీ అధ్య‌క్షుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి తెలంగాణ భ‌వ‌న్‌లో సోమ‌వారం పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం నిర్వ‌హించి పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు. దీంతో సిఎం కెసిఆర్ గారి ఆదేశానుసారం రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుగారు సోమ‌వారం సాయంత్రం మంత్రుల నివాసంలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో అందుబాటులో ఉన్న‌ ఉమ్మ‌డి జిల్లా, జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేష‌న్ చైర్మ‌న్లు త‌దిత‌రుల‌తో క‌లిసి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా కోసం ఓ ప్ర‌త్యేక నిర‌స‌న‌, ఉద్య‌మ ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో సిఎం కెసిఆర్ రైతుల కోసం అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తుంటే, రైతుల పంట‌ల పెట్టుబ‌డిగా రైతు బంధు, దేశంలో ఎక్క‌డా లేని విధంగా రైతు బీమా, సాగునీరు, 24 గంట‌ల కోత‌లు లేని క‌రెంటు, రుణ మాఫీలు, రైతు క‌ల్లాలు, రైతు వేదిక‌లు వంటి అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంటే, కేంద్రం రైతు వ్య‌తిరేక విధానాలు అవ‌లంబిస్తున్న‌ద‌న్నారు. దేశాన్ని ఆక‌లి రాజ్యం చేసే విధంగా కేంద్ర విధానాలున్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. దేశానికి అన్నంపెట్టే రైతుకు సున్నం పెట్టే విధంగా కేంద్ర వైఖ‌రి ఉంద‌న్నారు. ఈ వైఖ‌రిని నిల‌దీస్తూ, నిగ్గ‌దీస్తూ, ఖండిస్తూ, నిర‌స‌న తెలియ చేస్తూ, రైతాంగాన్ని కూడ‌గ‌డుతూ, పార్టీ శ్రేణులు, ప్ర‌జాప్ర‌తినిధులంతా క‌లిసి శాంతియుతంగా నిర‌స‌న ఉద్య‌మాలు చేయాల‌ని పిలుపునిచ్చారు.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో నియోజ‌కవ‌ర్గాల వారీగా ఇన్‌చార్జీలు..

ములుగు : మంత్రి శ్రీ‌మ‌తి స‌త్య‌వ‌తి రాథోడ్.
న‌ర్సంపేట : జెడ్పీ చైర్మ‌న్, శ్రీ‌మ‌తి గండ్ర జ్యోతి.
మ‌హ‌బూబాబాద్ : జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ ఆంగోత్ బింధు, నూక‌ల న‌రేశ్ రెడ్డి
స్టేష‌న్ ఘ‌న్ పూర్ : జెడ్పీ చైర్మ‌న్ పాగాల సంప‌త్ రెడ్డి, ఎమ్మెల్సీ, బ‌స్వ‌రాజు సారయ్య.
ప‌ర‌కాల : ఎమ్మెల్సీ, మాజీ ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి.
భూపాల‌ప‌ల్లి : ఎమ్మెల్సీ, మాజీ ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి.
జనగామ :ఎమ్మెల్సీ, పోంచ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి గారు
డోర్న‌క‌ల్ : ఎమ్మెల్సీ, బండా ప్ర‌కాశ్.
వ‌ర్ధ‌న్న‌పేట : ఎమ్మెల్సీ, త‌క్కెళ్ళ‌ప‌ల్లి ర‌వింద‌ర్ రావు.
పాలకుర్తి : మాజీ ఎమ్మెల్సీ, బోడకుంటి వెంక‌టేశ్వ‌ర్లు.

ఈ స‌మావేశంలో వ‌రంగ‌ల్‌, జ‌న‌గామ‌, ములుగు, భూపాల‌ప‌ల్లి జిల్లా ప‌రిష‌త్ ల చైర్ ప‌ర్స‌న్లు సుధీర్ కుమార్‌, పాగాల సంప‌త్ రెడ్డి, కుసుమ జ‌గ‌దీశ్‌, గండ్ర జ్యోతి, వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర మేయ‌ర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు క‌డియం శ్రీ‌హ‌రి, పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి, త‌క్కెళ్ళ‌ప‌ల్లి ర‌వింద‌ర్ రావు, డోర్న‌క‌ల్‌, ప‌ర‌కాల, వ‌ర్ద‌న్న‌పేట, న‌ర్సంపేట‌, భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యేలు డిఎస్ రెడ్యానాయ‌క్‌, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, అరూరి ర‌మేశ్‌, పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్‌, డిసిసిబి చైర్మ‌న్ మార్నేని ర‌వింద‌ర్ రావు, మాజీ ఎమ్మెల్సీ బోడ‌కుంటి వెంక‌టేశ్వ‌ర్లు, దివ్యాంగుల కార్పొరేష‌న్ చైర్మ‌న్ వాసుదేవ‌రెడ్డి, మాజీ చైర్మ‌న్ కిష‌న్ రావు, కృష్ణారెడ్డి, నూక‌ల న‌రేశ్ రెడ్డి, కేశ‌వ్‌, స‌తీశ్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -