విజయ్‌ ‘బీస్ట్’కు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..

111
- Advertisement -

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ ప్రస్తుతం ‘బీస్ట్’ మూవీలో నటించాడు. డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇక ‘బీస్ట్’ చిత్రాన్ని ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు.

ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఇదివరకు విడుదలైన ఈ సినిమా సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -