దుగ్యాల మృతి పట్ల మంత్రి ఎర్రబెల్లి సంతాపం..

126
Minister Errabelli
- Advertisement -

పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. దుగ్యాల శ్రీనివాసరావు నాకు సన్నిహితుడు..ఇద్దరం ఒకే నియోజకవర్గానికి చెందిన వాళ్ళం అని మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే గా దుగ్యాల.. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించారు. వారి మరణం తీరని లోటు..వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియచేస్తున్నాను అని మంత్రి తెలిపారు.

- Advertisement -