వర్మకు నోటీసులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!

29
RGV

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిస్తుంటారు. అయితే తాజా వర్మకు సంబంధించి ఓ షాకింగ్‌ న్యూస్‌ హల్‌ చల్‌ చేస్తోంది. తన సినిమాలకు పనిచేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, వర్కర్లకు దాదాపు కోటి రూపాయల వరకు ఎగ్గొట్టినట్లు సమాచారం. ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ మేరకు ఆయనకు లీగల్ నోటీసులు జారీ చేసినట్టు ఆ సంఘం అధ్యక్షుడు బీఎన్ తివారీ తెలిపారు. ఎగ్గొట్టిన డబ్బులను వెంటనే చెల్లించాలంటూ ఆ నోటీసులలో పేర్కొన్నారు. డబ్బులు చెల్లించనంత వరకు వర్మ సినిమాలకు ఇకపై తమ 32 యూనియన్లలో ఒక్కరు కూడా పనిచేయరని ఆయన హెచ్చరించారు. కాగా, ఎఫ్‌డబ్ల్యూఐసీఈ నోటీసులను వర్మ చాలా తేలిగ్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంపై వర్మ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.