డేటా ఇస్తారా?.. బయటికి పోతారా?..

63
whatsapp

టెక్ట్స్, ఫొటో, వీడియో, ఆడియో ఫైల్స్ ను ఉచితంగా చేరవేసే సేవల ద్వారా ప్రారంభమైన వాట్సప్ – ఇ మెయిల్ ను అధిగమించి ప్రపంచ జనాభాలో దాదాపు మూడోవంతు మంది…అంటే 200 కోట్లమంది జేబుల్లోకి చేరిపోయింది. వినియోగించుకోడానికి ఇంటర్నెట్ కనెక్షన్ వున్న ఫోన్ మినహా ఏ విధమైన సాంకేతిక నైపుణ్యమూ అవసరం లేకపోవడమే వాట్సప్ వేగంగా విస్తరించడానికి మూలం.

ఇప్పటివరకూ వాట్సప్ సేవలు ఉచితం. ఇకముందు కూడా ఉచితంగానే వుండవచ్చు. అయితే వాట్సప్ వినియోగదారుల సమాచారాన్ని ఫేస్ బుక్ ఉపయోగించుకోడానికి అనుమతి ఇవ్వాలని వాట్సప్ తాజాగా షరతు విధించింది. ఇక్కడ “అనుమతి” అనేది చాయిస్ కాదు. నిర్భంధం. ఫిబ్రవరి 20 లోగా ఇందుకు అంగీకరిస్తూ వాట్సప్‌ను అప్ డేట్ చేసుకోనివారికి ఆ తరువాత వాట్సప్ పనిచేయదు.

Whatsapp Privacy Policy

ఈ షరతుని ప్రకారం వాట్సప్‌ వాడుతున్న వినియోగదారుల వ్యక్తిగత డేటాను వాట్సప్‌ పేరేంట్‌ కంపెనీ అయిన ఫేస్‌బుక్‌ వాడుకుంటుంది. ఈ సమాచారాన్ని వాడుకొని ఈ కామర్స్‌ బిజినెస్‌ చేస్తుంది. ఒకవేళ కొత్త నిబంధనలకు అంగీకారం తెలపకుంటే వారికి వాట్సప్‌ సేవలు అందుబాటులో ఉండవని కూడా ప్రకటించింది. ఈ కొత్త నిబంధన బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌లలో మొదట అమలు చేస్తున్నారు. ఈ నిబంధన వ్యక్తిగత గోప్యతకు భంగం కల్గిస్తుందంటూ నెటిజన్లు, హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనలపై పలువురు ఆగ్రహంగా ఉన్నారు.