కేసీఆర్ పుట్టిన రోజు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి..

685
- Advertisement -

ఆకుపచ్చని తెలంగాణ, పర్యావరణహిత రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పరితపిస్తున్నారని, ఆయన స్వప్నాన్నినిజం చేసేందుకు ప్రతీ ఒక్కరూ పునరంకితం కావాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరిచుకుని ఫిబ్రవరి 17న అటవీ శాఖలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు అందరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఆదేశించారు.

ఈ మేరకు ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్) శోభతో మంత్రి మాట్లాడారు. అడవుల సంక్షణ, పునరుద్దరణపై ప్రజల్లోనూ విసృత అవగాహన కల్పించేదిశగా అటవీ శాఖ ఉద్యోగులు పనిచేయాలని మంత్రి సూచించారు. సీఎం ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేసి ఆకుపచ్చ తెలంగాణ సాధన లక్ష్యంగా అటవీ శాఖ అధికారులు పని చేయాలన్నారు. తెలంగాణాకు హరిత హారంలో పాల్గొందాం.. అడవుల సంరక్షణకు పునరంకితం అవుదాం..అని మంత్రి పిలుపునిచ్చారు.

minister allola

- Advertisement -