ఎస్పీ బాలు మృతి ప‌ట్ల మంత్రి అల్లోల దిగ్భ్రాంతి..

241
sp balu
- Advertisement -

సుప్ర‌సిద్ధ గాయ‌కుడు, గాన గంధ‌ర్వుడు, పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి ప‌ట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆయన‌ కుటుంబానికి ప్ర‌గాఢ సంతాపాన్ని తెలిపి,సానుభూతిని వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతున్ని ప్రార్థించారు. త‌న పాట‌ల‌తో ప్ర‌పంచంలోని కోట్లాది మంది అభిమానుల‌ను అల‌రించిన ఎస్పీ బాలు గొంతు మూగ‌బోయింద‌ని విచారం వ్య‌క్తం చేశారు.

ఎస్పీ బాలు నేప‌థ్య గాయ‌కుడిగానే కాకుండా నటుడిగా, సంగీత ద‌ర్శ‌కుడిగా కేవ‌లం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోనే కాకుండా భార‌తీయ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు విశేష సేవ‌లందించారని ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు. భార‌తీయ భాష‌ల్లో 40 వేల‌కు పైగా పాట‌లు పాడి రికార్డు సృష్టించ‌డ‌మే కాకుండా ప‌లు జాతీయ పురస్కారాలు, ఫిల్మ్ ఫేర్ అవార్డుల‌తో పాటు ప‌లు సంద‌ర్భాల్లో నంది అవార్డులు అందుకున్నారని తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మకు ముఖ్యంగా తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోట‌న్నారు.

- Advertisement -