బాలు ఆత్మకు శాంతిచేకూరాలి:వెంకయ్య,అమిత్ షా

95
venkaiah naidu

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అమిత్ షా. బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది.

వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు..దిగ్గజ గాయకుడి మరణవార్త తీవ్ర విచారకరం.…బాలు పాటలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచివుంటాయని పేర్కొన్నారు.