ఎస్పీబీ మృతి పట్ల బాలకృష్ణ సతాపం..

215
BalaKrishna

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై బాలకృష్ణ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందించారు. మరణం లేని స్వరం, మీ పాట అజరామరాం. మీరు నాకు పాడిన పాటలు, నాకు మీరిచ్చిన వరాలు అన్నారు. మీరు లేకున్నా మీ పాటగా నాతోనే ఉంటారు, దేశ సంగీత ప్రియుల గుండెల్లో సంతకంగా మిగిలిపోతారు. అలాంటి గొప్ప గాయకుడు, గొప్ప వ్యక్తి మనతో లేకపోవడం ఎంతో విచారకరం. బాలు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని నందమూరి బాలకృష్ణ తెలిపారు.