`మెట్రో`మరో జర్నీ….

77
Metro-Movie-Posters_telugufilmnagar-2

`వ‌ర‌ల్డ్ సినిమాని, ఇత‌ర సినిమాల్ని మంచి క‌థ‌లు ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్ష‌కులు చూడాల‌నుకుంటున్నారు. భాష అర్థం కాక‌పోయినా పొరుగు సినిమాలు చూడాల‌ని ఆశిస్తున్నారు. ప్రేమిస్తే, పిజ్జా, షాపింగ్ మాల్, జ‌ర్నీ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్లు ప్రేక్ష‌కుల్లో మారిన‌ అభిరుచికి నిద‌ర్శ‌నం. ఆ త‌ర‌హాలోనే వ‌స్తున్న మ‌రో సినిమా `మెట్రో`. `జ‌ర్నీ`ని మించి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టే చిత్ర‌మిది“ అన్నారు హీరో నందు. ఈ యంగ్ హీరో `మెట్రో` మూవీలో హీరో పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

`ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `షాపింగ్‌మాల్‌`, `పిజ్జా` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను తెలుగువారికి అందించిన సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్‌-4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌జ‌ని తాళ్లూరి ఈ చిత్రాన్ని తెలుగువారికి అందిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన‌ ట్రైల‌ర్‌కి, గీతామాధురి స్పెష‌ల్ సాంగ్‌కి ప్రేక్ష‌కాభిమానుల్లో అద్భుత స్పంద‌న వ‌చ్చింది. అనువాద కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 23న రిలీజ‌వుతోంది.

Metro-Movie-Posters_telugufilmnagar-2

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నందు మాట్లాడుతూ -“త‌మిళ్‌లో సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయిన చిత్ర‌మిది. తెలుగు సినిమాల్లో ట్రెండ్ సెట్ట‌ర్స్ అందించారు సురేష్ కొండేటి. మంచి త‌మిళ చిత్రాల్ని తెలుగువారికి అందించారు. ఈ సినిమాకి వెల్ నోన్, ఎస్టాబ్లిష్డ్‌ ఆర్టిస్టుల‌తో డ‌బ్బింగ్ చెప్పారు. హీరో పాత్ర‌కు నేను డ‌బ్బింగ్ చెప్పాను. ఈ సినిమా త‌మిళ్‌ని మించి పెద్ద విజ‌యం సాధిస్తుంది. ఇలాంటి మ‌రిన్ని మంచి సినిమాల్ని సురేష్‌గారు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తారు. మెట్రో.. జ‌ర్నీ సినిమాని మించి పెద్ద విజ‌యం సాధిస్తుంది. మీరంతా థియేట‌ర్ల‌కు వ‌చ్చి టీమ్‌ని బ్లెస్ చేసి మంచి సినిమాని చూసి ఆనందిస్తార‌ని ఆశిస్తున్నా“ అన్నారు.

నిర్మాత ర‌జ‌నీ తాళ్లూరి మాట్లాడుతూ -“డ‌బ్బింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్త‌య్యాయి. డిసెంబ‌ర్ 23న సినిమా రిలీజ్ చేస్తున్నాం. ట్రైల‌ర్ స‌హా గీతామాధురి స్పెష‌ల్‌గా అప్పియ‌రెన్స్ ఇచ్చిన పాట జ‌నాల్లోకి దూసుకెళ్లాయి. పెద్ద విజ‌యం అందుకుంటామ‌న్న ధీమా ఉంది“ అన్నారు.

Metro-Movie-Posters_telugufilmnagar-2

స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ -“చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుత‌మైన భావోద్వేగాల‌తో సాగే చిత్ర‌మిది. గౌత‌మ్ మీన‌న్ అంత‌టి స్టార్ డైరెక్ట‌ర్ మెచ్చిన చిత్రం కూడా. నేను నిర్మించిన `జ‌ర్నీ` సినిమాని మించి `మెట్రో` విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. గీతామాధురి న‌టించిన పాట‌కు ప్రేక్ష‌కాభిమానుల్లో అద్భుత స్పంద‌న వ‌చ్చింది“ అన్నారు.

ర‌చ‌యిత సాహితి మాట్లాడుతూ -“మెట్రో చిత్రానికి పాట‌లు, మాట‌లు అందించాను. ఎంతో హృద్య‌మైన క‌థాంశం ఉన్న చిత్ర‌మిది. చైన్ స్నాచింగ్ కొంద‌రి జీవితాల్ని ఎలా నాశ‌నం చేస్తుందో తెర‌పై మ‌న‌సుకు హ‌త్తుకునేలా చూపించారు. ఈ సీజ‌న్‌లో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ ఖాయం“ అన్నారు.