పురుషుల హాకీ ప్రపంచ కప్‌ @2023

210
fih
- Advertisement -

పురుషుల హాకీ ప్రపంచ కప్ 2023 భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో మరియు రూర్కెలాలోని బిర్సా ముండా స్టేడియంలో జనవరి 13 నుండి 29, 2023 వరకు జరుగనున్న వేళ…నేడు ఇంటర్‌నేషనల్‌ హకీ పెఢరేషన్‌ సీఈవో థియరీ వెయిల్‌, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ జట్లను డ్రా చేశారు. ఈ కార్యక్రమంలో ఒడిషా క్రీడల మంత్రి తుషారా కాంతి బెహరా, సీవోఏ మెంబర్‌, హాకీ ఇండియా ఎస్‌ వై ఖురేషీ పాల్గోన్నారు.

16 దేశాల జట్లను 4 పూల్స్‌గా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లు ఉంటాయన్నారు. ప్రతి గ్రూప్‌లోని అగ్రశ్రేణి జట్టు, వారి ర్యాంకింగ్‌ల అధారితంగా నిర్ణయించామని పేర్కొన్నారు. ఆతిథ్యమిచ్చిన భారత్‌ నాలుగో గ్రూప్‌లో ఉండగా, అయితే ర్యాంకింగ్‌ పరంగా చూస్తే ఐదవ స్థానంలో ఉంది. గ్రూప్‌ డీలో ఇండియా, ఇంగ్లాండ్‌, స్పెయిన్‌, వేల్స్‌ గా ఉన్నాయి. 2018లో జరిగిన ప్రపంచ హకీ కప్‌ విజేతగా నిలబడ్డ బెల్జియం…బీ గ్రూప్‌లో చోటు సంపాందించుకుంది. ర్యాంకింగ్‌ పరంగా టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా మొదటి గ్రూప్‌లో ఉండగా…దీనికి తోడుగా అర్జెంటినా, ఫ్రాన్స్‌, సౌత్‌ ఆఫ్రికాలు ఉన్నాయి. గ్రూప్‌ బీలో బెల్జియం, జర్మనీ, సౌత్‌ కొరియా, జపాన్‌లు ఉన్నాయి. గ్రూప్‌ సీలో నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌, మలేషియా, చిలీ దేశాలు ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్‌లన్నీ ఒడిషా రాషంలోనే జరగనున్నాయి.

- Advertisement -