లైంగికదాడులకు వ్యతిరేకంగా మహిళా లోకం ‘మీ టూ’ ఆయుధంతో గర్జిస్తోంది. గతంలో తాము అనుభవించిన లైంగిక వేధింపుల పట్ల ధైర్యంగా ముందుకొచ్చి నిందితుల పేర్లు బహిర్గతం చేస్తున్నారు. బాలీవుడ్‌లో తనూశ్రీ దత్తాతో మొదలైన ఈ ఉద్యమం.. కేంద్ర మంత్రి ఎం.జె. అక్బర్‌పై ఆమె దగ్గర పనిచేసిన మహిళా జర్నలిస్ట్ చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా హిటెక్కింది. కార్పొరేట్, మీడియా, రాజకీయం,క్రీడా ఇలా అన్నిరంగాల్లో మీ టూ ప్రకంపనలు సృష్టిస్తోంది.
అయితే మరో ఉద్యమం తెరమీదకు వచ్చింది. ‘మీటూ’ ఉద్యమం తరహాలోనే ఆడవాళ్ల వేధింపులు, సాధింపులను వెలుగోలకి తీసుకురావడానికి ‘మెన్ టూ’ ఉద్యమం ప్రారంభమైంది.
బెంగళూరుకు చెందిన క్రిస్ప్ అనే స్వచ్ఛంద సంస్థ మెన్ టూ ఉద్యమాన్ని ప్రారంభించింది. తప్పుడు కేసులు, ఆరోపణల కారణంగా బాధపడుతున్న పురుషుల ఆవేదనను వెలుగులోకి తీసుకురావడమే మెన్‌టూ ఉద్దేశం సామాజిక కార్యకర్త కుమార్ జాగిర్దార్ తెలిపారు. మీటూకి ఇది వ్యతిరేకం కాదని మహిళలకు అన్యాయం జరిగినా తాను గళమెత్తి పోరాటం చేస్తానని జగిర్దార్ తెలిపారు. మీటూ యే కాదు… మెన్‌టూ కూడా హాట్ టాఫిక్‌గా మారింది.