బీజేపీలోకి మహేంద్రుడు..అదేబాటలో గంభీర్!

264
Dhoni to Join BJP..!
- Advertisement -

భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు మహేంద్రసింగ్ ధోని. కెప్టెన్‌గా తిరుగులేని విజయాలు అందించిన ధోని…కపిల్ దేవ్ తర్వాత భారత్‌కు వరల్డ్ కప్‌ అందించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం వన్డే,టీ20లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోని త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ధోనికి ఉన్న మైలేజ్‌ని క్యాచ్ చేసుకునేందుకు కాషాయ దళం వ్యూహం సిద్ధం చేసిందని ఓ ఆంగ్లపత్రిక కథనాన్ని ప్రచురించింది. 2019 ఎన్నికలలో బీజేపీ తరపున ధోనిని బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ధోనితో పాటు టీమిండియా ఓపెనర్‌ గంభీర్‌ను కూడా ఎన్నికల కథన రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తను ప్రచురించింది.

Image result for dhoni bjpదేశరాజధాని ఢిల్లీకి చెందిన గంభీర్‌ను బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి స్థానంలో పోటీలో పెట్టే యోచనలో బీజేపీ ఉందని ఆ పత్రిక పేర్కొంది. మీనాక్షి లేఖీకి పనితీరుపై ప్రజలు అనంతృప్తితో ఉన్నారని ఆమె స్థానంలో గంభీర్‌ను బరిలోకి దించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తుందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ వీరి నుంచి స్పష్టత వస్తే క్రికెట్‌ నుంచి రాజకీయాల్లో చేరిన జాబితాలో వీరుకూడా చేరిపోతారు.

ఇప్పటికే నవజ్యోత్ సింగ్ సిద్దూ,అజారుద్దీన్ కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా ఉండగా శ్రీశాంత్ కేరళలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

- Advertisement -