డోనాల్డ్ ట్రంప్ ఓటమిని ఒప్పుకోవాలి: మెలానియా

275
trump
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్‌ తన ఓటమిని ఇంకా అంగీకరించలేదు. ఫలితం స్పష్టంగా తేలినా.. తానే విజేతనని ప్రకటించుకున్న ట్రంప్… కోర్టు కేసులున్నాయన్న మాట మరిచిపోవద్దని తెలిపారు.

అయితే ట్రంప్ వ్యాఖ్యలను రిపబ్లికన్ పార్టీ నాయకులతో పాటు,ఆయన భార్య మెలానియా ట్రంప్ తప్పుబట్టారు. ఓటమిని అంగీకరించాలని ట్రంప్‌కి సూచించినట్లు సమాచారం.

రెండ‌వ సారి అధ్య‌క్షుడిగా పోటీ చేసిన ట్రంప్ త‌ర‌పున‌ మెలానియా ప్ర‌చారం నిర్వ‌హించారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో బైడెన్ 290, ట్రంప్ 214 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌ను గెలుచుకున్నారు.

- Advertisement -