మొక్కలు నాటిన సునీల్

67
sunil

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు హీరో సునీల్‌.

సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు సునీల్. మన జీవితానికి కావలసిన ఆక్సిజన్ తీసుకోవడం కోసం మనం మొక్కలు నాటాలన్నారు. వృక్షో రక్షిత రక్షితః అని పెద్దలు చెప్పారని అందులో భాగంగా తనవంతుగా మూడు మొక్కలు నాటానని తెలిపారు సునీల్.

ఈ ఛాలెంజ్‌ని ప్ర‌తి ఒక్క‌రు బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటి ముందుకు తీసుకుపోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్టిస్ట్ సురేఖ వాణి , డైరెక్టర్ సందీప్ రాజ్ , హీరో సుహాస్ , హీరోయిన్ చాందిని చౌదరి , మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు కాల భైరవ , కమెడియన్ వైవా హర్ష లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు సునీల్.